ఐస్‌క్రీం కోసం కోపంతో ఊగిపోయిన చిన్నారి..వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో టర్కిష్ ఐస్‌క్రీం బాగా ట్రెండ్ అవుతోంది. కస్టమర్స్‌కు ఐస్‌క్రీం అందించే క్రమంలో షాప్ బాయ్స్ చేస్తున్న ట్రిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఐస్ క్రీం అందుకునే సమయంలో చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. కొందరు పిల్లలు సరదగా ఉంటే..మరికొందరు ఐస్ క్రీం ఇవ్వకుండా విసుగు పుట్టిస్తునందుకు తమ కోపాన్ని ప్రదర్శించడం, ఏడవడం వంటివి చూస్తున్నాం. తాజాగా మరో చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.
क्यों परेशान कर रहे हो बेचारी को 😂👏😎 pic.twitter.com/V5slqNAqwr
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022
ఐస్‌క్రీం కోసం బండి దగ్గరికి వచ్చిన చిన్నారికి కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ఐస్‌క్రీం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకున్నాడు. తన టెక్నిక్స్‌తో ఐస్ క్రీంను పాపకు ఇవ్వకుండా ఆటపట్టించాడు. రెండు సార్లు ఐస్ డొక్కు మాత్రమే ఇచ్చి మ్యాజిక్ చేశాడు. దీంతో ఆ చిన్నారి ఏడూస్తు కోపంతో ఊగిపోయింది. ఆ ఐస్ క్రీం ఇచ్చే అతనిపై ఐస్‌క్రీం నింపే డొక్కులను విసిరి కొట్టి తన కోపాన్ని ప్రదర్శించింది. ఐస్ క్రీం ఇస్తావా..చస్తావా అన్నట్టు ఏడూస్తుూనే అతనిపై కోపాన్ని ప్రదర్శించింది. ఐస్‌క్రీం బండిని పట్టుకొని కోపంతో శివాలెత్తింది. చివరికి ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకుని ఐస్‌క్రీమ్ అందించాడు. ఈ వీడియోను చూసిన వారంతా అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు. కింద ఉన్న చిన్నారి వీడియోపై మీరు ఓ లుక్కేయండి