ఉత్తరాఖండ్‌లో జోషిమత్‌లో భూమి బీటలు వారుతున్న నేపథ్యంలో దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్ సభలో చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు వైరల్ అయ్యింది. జోషిమత్ లో భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితికి NTPCప్రాజెక్టు కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో గతంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై గతంలో సుష్మాస్వరాజ్ లోకసభలో ప్రసంగించారు.
Just look at this..
BJP when in opposition had strongly opposed UPA govts decisions of building dams on River Ganga &development in himalayas
Mrs Sushma Swaraj in her terrific speech as opp leader had called it "Vinaash ¬ Vikas"
The same applies to modi govt too#Joshimath pic.twitter.com/BbWIsiBAN0
— Ritu #सत्यसाधक (@RituRathaur) January 10, 2023
2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో సంభవించిన వరదల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సరిగ్గా లోకసభ ఎన్నికల కు ముందు జరిగిన ఈ ప్రకృతి విలయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ..ఆ ఏడాది సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆ అంశాన్ని లేవనెత్తింది. ఆ సమయంలో దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి పేరుతో పర్యావరణంపై దాడులు జరుగుతున్నాయని..దాని ఫలితమే కేదార్ నాథ్ వరదలని..మనం ఎవరి కోసం ఈ అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రశ్నించింది. వీటి కారణంగా ఏదొక రోజు ప్రకృతి ఉగ్రరూపం దాల్చి..నాశనం చేస్తుందని..మనం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే..ఇంకెప్పుడు గ్రహిస్తామంటూ ఆగ్రహిస్తూ..అప్పటి యూపీఏ సర్కార్ ను నిలదీశారు సుష్మాస్వరాజ్. దీనికి సంబంధించిన వీడియో ఇఫ్పుడు వైరల్ గా మారింది.