Home > Featured > కుక్క కోసం ఏకమైన గ్రామం.. ప్రెసిడెంట్ ప్రత్యేక శ్రద్ధ

కుక్క కోసం ఏకమైన గ్రామం.. ప్రెసిడెంట్ ప్రత్యేక శ్రద్ధ

A village in Kasaragod comes together to save street dog

సాటి మనిషి బాగోగుల్నే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ మూగ జంతువైన కుక్కను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు ఆ గ్రామ ప్రజలు. హాస్పిటల్ లో సర్జరీ చేయించి.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి కాబోతున్న ఆ ప్రాణి కోసం ఎదురు చూస్తున్నారు. కేరళలోని డోం-బెల్లూర్ గ్రామ పంచాయితీలోని చుల్లిక్కర గ్రామంలో ముత్తుమణి అనే ఒక ఆడ కుక్క నివసిస్తోంది. ఇండియన్ పరియా డాగ్ అనే జాతికి చెందిన ఈ శునకం ఏటా కొన్ని పిల్లలకు జన్మనిస్తుంది. ఈ పిల్లలను గ్రామంలోని చాలా మంది ప్రజలు తీసుకెళ్తుంటారు. అయితే మూడు నెలల క్రితం ముత్తుమణి కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత దీని రొమ్ముల వద్ద ఒక వాపు కనిపించింది.

ఆ వాపు వారం రోజుల వ్యవధిలోనే పెద్దది కావడంతో ఆందోళన పడ్డ గ్రామస్తులు.. తొలుత రాజపురంలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో.. ఈ సారి తమ గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికరిపూర్‌లోని గవర్నమెంట్ వెటర్నరీ ఆసుపత్రిలో చేర్పించారు. ఊరి ప్రెసిడెంట్ బేబీ బాలకృష్ణన్ ఈ కుక్క గురించి వెటర్నరీ సర్జన్ ఎ మురళీధరన్‌కు ప్రత్యేకంగా చెప్పారు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ డాక్టర్ రిఫరెన్స్‌తో ముత్తుమణి కేసును ప్రభుత్వ పశువైద్యశాలలో టాప్ సర్జన్ అయిన డాక్టర్ ఫాబిన్ ఎం. పైలీ టేకప్ చేశారు. ముత్తుమణి క్షీరరసగ్రంధి కణితితో బాధ పడుతుందని గుర్తించి.. సర్జరీ చేసి 5 కిలోల బరువున్న ఆ కణితిని తొలగించారు. ప్రస్తుతం ముత్తుమణి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సర్జన్ తెలిపారు. ఈ కుక్క ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిగా ఉందని , మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. దీంతో దీని కోసం ఆ గ్రామంలోని దుకాణాదారులు క్యాబ్ డ్రైవర్లు ఇలా అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఒక కుక్క కోసం ఏకంగా గ్రామమంతా కదిలింది అని తెలిసి అందరూ ఫిదా అవుతున్నారు.

Updated : 27 Jun 2022 9:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top