A white elephant born in Myanmar
mictv telugu

మయన్మార్‌లో పవిత్రమైన తెల్లఏనుగు.. అదృష్టంగా భావిస్తున్న సైనిక ప్రభుత్వం

August 5, 2022

ప్రపంచవ్యాప్తంగా ఏనుగులు సాధారణంగా బూడిద రంగులోనో లేక గోధుమ రంగులోనో ఉంటాయి. కానీ మయన్మార్‌లో మాత్రం ఓ నల్ల ఏనుగుకు తెల్ల ఏనుగు పిల్ల పుట్టింది. ఏ సంస్కృతిలోనైనా తెల్ల ఏనుగులను పవిత్రంగా చూస్తారు. మన పురాణాల్లో చెప్పినట్టు ఇంద్రుడి వాహనం తెల్ల ఏనుగు దాని పేరు ఐరావతం. మనలాగే బౌద్దులకు కూడా తెల్ల ఏనుగంటే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో తెల్ల ఏనుగు పిల్ల పుట్టిందని ఆ దేశ అధికారిక మీడియా వీడియో విడుదల చేసింది. అందులో తల్లి ఏనుగు పిల్ల ఏనుగు సరస్సులో స్నానం చేస్తుండగా, పిల్ల ఏనుగు పాలు తాగుతున్నప్పుడు తీసిన వీడియోలను పంచుకుంది. ‘రెండున్నర అడుగుల ఎత్తు, 80 కిలోల బరువు, ముత్యం రంగులో కళ్లు, తిన్నగా ఉన్న తోక, తెల్లని వెంట్రుకలు, చర్మంపై పవిత్ర చిహ్నాలు, పెద్ద చెవులు, ముందు కాళ్లకు ఐదు, వెనుక కాళ్లక నాలుగు గోర్ల చొప్పున ఉన్నాయి. ఇవన్నీ పవిత్ర ఏనుగుకు ఉండే లక్షణాలు’ అని అక్కడి మీడియా చెప్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 30 వరకు మాత్రమే తెల్ల ఏనుగులు ఉన్నట్టు ఒక అంచనా.