A wife married to her husband with a lover in tirupathi
mictv telugu

ఏపీ : దగ్గరుండి ప్రియురాలితో భర్తకు పెళ్లి చేసిన భార్య.. కాపురం మాత్రం..

September 22, 2022

భర్త వేరొక మహిళతో సన్నిహితంగా ఉంటే సాధారణంగా భార్యలు సహించలేరు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలాంటిది ఓ భార్య తన భర్త ప్రేమను అర్ధం చేసుకొని ప్రేయసితో దగ్గరుండి పెళ్లి చేయించింది. అంతేకాక, తన సవతి చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పి వార్తల్లో నిలిచింది. ఏపీలోని తిరుపతిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని అంబేద్కర్ నగర్‌లో నివాసముండే ఓ యువకుడు సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో రాణిస్తున్న సమయంలో టిక్ టాక్‌లోనే వైజాగ్‌కు చెందిన ఓ యువతి పరిచయమైంది. అది క్రమంగా పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం చనువుగా ఉన్నప్పటికీ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అదే టిక్ టాక్‌లో కడపకు చెందిన మరో అమ్మాయి పరిచయమవగా, వారిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుందనుకునే సమయానికి విశాఖకు చెందిన మాజీ ప్రేయసి మళ్లీ తిరిగొచ్చింది. ప్రియుడికి పెళ్లయిందని తెలిసి బాధపడింది. తేరుకున్నాక తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురం కలిసే ఉందామని ప్రియుడి భార్యతో చెప్పింది. ఆ మాటతో మొదట ఖంగుతిన్న మొదటి భార్య చివరికి ఒప్పుకుని తానే దగ్గరుండి ప్రేయసితో భర్తకు పెళ్లి జరిపించింది. అంతేకాక, ప్రేయసిని తానే స్వయంగా పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి అలంకరించింది. దీంతో ఈ విషయం తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది.