A wife who shot her husband dead in america
mictv telugu

చిన్నారులపై భర్త అఘాయిత్యం.. తుపాకీతో కాల్చి చంపిన భార్య

July 29, 2022

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి పిల్లలను డేకేర్ సెంటర్లలో వదిలేస్తున్న కాలం ఇది. అభం శుభం తెలియని చిన్నారులపై అక్కడ ఏం జరుగుతుందో కూడా పేరెంట్స్‌కి తెలియడం లేదు. అలాంటి వారికి హెచ్చరిక లాంటి సంఘటన అమెరికాలో జరిగింది. వాషింగ్టన్‌లో జేమ్స్, శాంతేరీ అనే జంట డేకేర్ సెంటర్ రన్ చేస్తోంది. ఈ క్రమంలో భర్త జేమ్స్ సెంటర్‌కి వచ్చే ముగ్గురు చిన్నారులపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించి జీర్ణించుకోలేని భార్య శాంతేరీ, ఈ విషయంపై భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగగా, కోపం పట్టలేని భార్య తుపాకీ తీసుకొని భర్తను అక్కడికక్కడే కాల్చి చంపేసింది. పోలీసులకు విషయం తెలసి అక్కడికి చేరుకోగా, మహిళ రాసుకున్న డైరీని వారు స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త నిర్వాకం, పక్షవాతం వచ్చేవరకు ఓ మనిషిని ఎన్నిసార్లు కాల్చాలి వంటి వివరాలు చూసి షాకయ్యారు. అయితే మరో షాకింగ్ పరిణామం ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ నేరం ఒప్పుకోవట్లేదు. దాంతో కేసును పరిష్కరించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఎలాగైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మహిళను న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు అంటున్నారు.