A wife writes on her husband's grave that he is an adulterer
mictv telugu

కొలీగ్‌తో సెక్స్ చేస్తూ చనిపోయిన భర్త.. వెరైటీగా రివెంజ్ తీర్చుకున్న భార్య

September 27, 2022

A wife writes on her husband's grave that he is an adulterer

ఇదొక నిజంగా జరిగిన సున్నితమైన ప్రతీకార కథనం. అమెరికాలో నివసించే జాన్ డే అనే వ్యక్తికి ఓ భార్య, కొడుకు ఉన్నారు. కానీ, జాన్ తన కొలీగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య అనేకసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాక, భార్యను, కొడుకును వదిలేసి కొలీగ్‌తో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో కొలీగ్ గర్భం దాల్చడంతో ఆమెతో కలిసి కెనడాకు వెళ్లిపోవాలని భావించాడు.

A wife writes on her husband's grave that he is an adulterer

కానీ, కొద్డి రోజుల తర్వాత అనూహ్యంగా కొలీగ్‌తో సెక్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. తర్వాత జరిగిన పరిణామాలను జాన్ కొడుకు ఇలా చెప్పుకొచ్చాడు. ‘నా తల్లిదండ్రుల మధ్య విడాకుల వ్యవహారం ఏం జరగలేదు. తండ్రి చేస్తున్న పనికి తల్లి ఎంతో బాధపడేది. కానీ, తండ్రిలో మార్పు మాత్రం రాలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత తన రివెంజ్‌ను ఈ విధంగా తీర్చుకుంది’ అని తండ్రి సమాధిపై రాయించిన అక్షరాలను పోస్ట్ చేశాడు. ఆ సమాధిపై ఇలా రాసి ఉంది. ‘జాన్ డే.. లవింగ్ సన్, హస్బెండ్, ఫాదర్, వ్యభిచారి’ అని రాసి ఉంది. తన తల్లి స్వీట్ రివెంజ్‌కు మద్ధతు తెలుపుతున్నానని, కానీ, ఈ వ్యాఖ్యల పట్ల తండ్రి కుటుంబంతో పాటు కొలీగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వివరించాడు. ఈ చర్య అమెరికాలో వివాదాస్పదమవుతుండగా, సమాధిపై రాసిన రాతలను పరిశీలించి చూస్తే ఎఫ్‌తో మొదలయ్యే మరో బూతు పదం కూడా ఉందని తెలుస్తుంది. తన తండ్రి ఎలాంటి వాడో తెలియజేయాలనే ఉద్దేశంతో తల్లి ఇలా చేసిందని కొడుకు సమర్ధించుకున్నాడు.