అడవిలో నివసించే కొన్ని జంతువులను కొందరు తమ ఇళ్లల్లో పెంచుకోవడం హాబీగా పెట్టుకుంటారు. ఇందులో ప్రమాదకర, విషపూరితమైనవి కూడా ఉంటాయి. వాటిని అంతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ అడవికి రారాజైన క్రూర జంతువు సింహాన్ని ఎవరైనా పెంచుకుంటారా? భీకర మగమహారాజులు కూడా దగ్గరికెళ్లడానికి సాహసించని సింహాన్ని ఓ సాధారణ మహిళ చిన్న పిల్లాడిని ఎత్తుకున్నట్టు అలవోకగా ఎత్తుకెళ్తోంది.
ఎంతో శక్తివంతమైన సింహాన్ని ఎలాంటి బెరుకు లేకుండా తీసుకెళ్తుండడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా వీడియో చూసి జడుసుకోవాల్సిందే. ఈ వీడియోను ఇన్ స్టాగ్రాంలో యానిమల్స్ పవర్స్ అనే అకౌంట్లో పోస్ట్ చేయగా, వైరల్ అయింది. పది సెకెన్ల వీడియోలో సింహం మహిళ నుంచి తప్పించుకోవడానికి యత్నిస్తుండగా, మహిళ మరింత గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు. కువైట్ వీధుల్లో జరిగినట్టు చెప్తున్న ఈ సంఘటనలో సదరు సింహం మహిళ పెంపుడు జంతువని, రాత్రివేళ తప్పించుకుని నివాస ప్రాంతాల్లో తిరుగుతూ భయాందోళనలకు గురి చేసిందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అంటే మనుషుల పెంపకంలో సింహం సాధు జంతువుగా మారిందన్నమాట అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.