A woman cross four continents for food delivery
mictv telugu

ఫుడ్ డెలివరీ కోసం నాలుగు ఖండాలు దాటింది!

November 19, 2022

ఫుడ్ డెలివరీ కోసం ఎన్నోయాప్స్ వచ్చాయి. వాటిలో ఆర్డర్ పెట్టాలంటే మన దగ్గరలోని రెస్టారెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. దగ్గరలో ఉన్నవాళ్లే మనకు డెలివరీ చేస్తారు. కానీ ఈమె అలా కాదు.. ఏకంగా నాలుగు ఖండాలు దాటి ఫుడ్ పార్సిల్ ఇచ్చి వచ్చింది.

మానస గోపాల్ చెన్నైకి చెందిన అమ్మాయి. ఉద్యోగరీత్యా సింగపూర్లో ఉంటుంది. అక్కడ ఆమె ఎన్విరాన్మెంటల్ బయోకెమిస్ట్లో పరిశోధకురాలిగా ఉంది. ఈమె సూపర్నియో అనే ఒక కంపెనీని కూడా నడుపుతున్నది. ఈమె పంతొమ్మిదేండ్ల వయసులో ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. ప్రస్తుతం ఆమెకు 25 సంవత్సరాలు. ఈ వయసులో ఒంటరిగా ఏడు ఖండాలను చుట్టి వచ్చిన ఘనత ఆమె సొంతం. ఇదేకాదు.. ఇప్పుడు మరొక ఫీట్ కూడా చేసిందీ అమ్మాయి. తన ఫుడ్ డెలివరీ గర్ల్ అవతారం ఎత్తింది. అది ఎందుకో తర్వాత తెలుసుకుందాం. ముందు ఆమె చేసిన సాహస యాత్ర గురించి తెలుసుకుందాం. ఫుడ్ ఇవ్వడానికి సింగపూర్ నుంచి బయలుదేరింది. ఏకంగా నాలుగు ఖండాలు దాటుకొని అంటార్కిటికాలోని ఒక కుగ్రామంలో ఫుడ్ డెలివరీ చేసింది. దాదాపు 30వేల కిలోమీటర్ల మేర ఈమె ప్రయాణం కొనసాగింది. ప్రపంచంలోనే ఇంత దూరం ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసిన ఘనత కూడా ఈమెకే దక్కుతుంది. ఈమె చేసిన ప్రయాణం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ని 38వేల మందికి పైగా చూశారు. ఎంతోమంది లైక్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

మానస ముందుగా సింగపూర్ నుంచి హంబర్గ్ వెళ్లింది. అక్కడ నుంచి అర్జెంటీనా, చివరగా అంటార్కిటికాలో అడుగుపెట్టింది. మొత్తానికి విజయవంతంగా పూర్తి చేశాను. ‘ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సింగపూర్ నుంచి అంటార్కిటికాకి వెళ్లడం అక్కడ ఫుడ్ డెలివరీ చేశాను. ఫుడ్పాండా వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఫీట్ చేయడానికి వారి సహకారం ఉంది. ఎంతటి కుగ్రామానికి అయినా వాళ్లు తమ ఫుడ్ని చేరుస్తారు’ అంటున్నది. 2021లో ఆమె అంటార్కిటికా యాత్ర చేయాలనుకుంది. దీనికి ఫండ్స్ కావాలని కోరుకుంది. ఆ కోరికని చూసిన ఫుడ్పాండా వాళ్లు ఇలా ఆమె కోరిక తీర్చారు. 2018లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ఇలా తన కోరిక తీరడం కోసం ఫుడ్ డెలివరీ చేసింది. ఆమె ఒంటరి ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ఆమె రాసే బ్లాగ్ www.maanasa.xyz/ ని క్లిక్ చేయండి.