నకిలీ పోలీస్‌కు మహిళ దేహశుద్ది..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ పోలీస్‌కు మహిళ దేహశుద్ది..వీడియో

May 8, 2019

జార్ఖండ్ రాజధాని జంషెడ్‌పూర్‌లో ఓ ప్రబుద్దుడు ఏసీబీ అధికారి అవతారమెత్తాడు. ఏసీబీ అధికారినని చెప్పుకుంటూ అమాయకుల దగ్గర డబ్బు వసూల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి భాదిత మహిళ ఒకరు దేహశుద్ది చేసింది. ఏసీబీ అధికారిగా చెలామణి అవుతూ… ఐడీ కార్డు చూపించి… పలువురి దగ్గర లక్షల్లో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఓ మహిళకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అతడి గురించి ఆ మహిళ ఆరా తీసింది. నకిలీ అధికారి అని తెలుసుకుని… ఓ ప్రాంతానికి రమ్మని చెప్పింది. మహిళ చెప్పిన చోటికి నకిలీ అధికారి కారులో చేరుకోగానే కర్రతో ఓ వ్యక్తి దాడి చేశారు. ఆ తర్వాత మహిళ కూడా దేహశుద్దికి చేసింది. మమ్మల్నే మోసం చేస్తావా అంటూ… మిగితా బాధితులు కూడా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర్నుంచి కారు, నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.