A woman took a selfie video in floods
mictv telugu

నీళ్లల్లో కొట్టుకుపోతున్నా వదలని సెల్ఫీ మోజు.. మహిళ వీడియో వైరల్

July 13, 2022

ప్రస్తుతం రుతుపవనాల రాక, అల్పపీడన ద్రోణితో దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసి రాష్ట్రాలు వరద తాకిడికి గురవుతున్నాయి. దీంతో చాలా వరకు రాష్ట్రాలు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో వరదల్లో వస్తున్నా సరే సెల్ఫీ తీసుకుంటున్న మహిళ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది పాతదే అయినా ప్రస్తుత పరిస్థితిలో నెటిజన్లు అధికంగా షేర్ చేస్తున్నారు. వీడియోలో మహిళ ప్రమాదమని తెలిసినా సెల్ఫీ వీడియో కోసం వరద వచ్చినా లెక్కచేయలేదు. వరద వచ్చి తనను కింద పడేసి ముంచేసినా సెల్ఫీ స్టిక్కు వదలకుండా పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ విఫలమైంది. కూడా ఉన్న ఓ యువకుడు ఆమె స్టిక్కును పట్టుకొని ఆమె లేచిన తర్వాత తిరిగిచ్చేస్తాడు. ఏం జరిగినా సరే వీడియోను తీయాలన్న ఉత్సాహం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు మహిళపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు.