డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ 25 ఏళ్లపాటు చేతివేళ్ల గోళ్లు పెంచి, గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. ఆమె గోర్లన్నీ కలిపితే.. 42 అడుగుల 10.4 అంగుళాలు పొడవు ఉన్నట్లు గిన్నిస్ బుక్ రికార్డ్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు గోళ్లను ఇలా పెంచుకోలేదని, మొదటి మహిళగా డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
అయితే, డయానా అలా గోళ్లు పెంచడం వెనుక ఓ విషాద గాథ ఉందంట..”డయానా కూతురు ఆస్తమాతో చనిపోయింది. చనిపోవడానికి ముందు రోజంతా తల్లితోనే ఆ అమ్మాయి గడిపింది. రాత్రిపూట తల్లి గోళ్లు తీసి, పాలిష్ చేసింది. ఆ తర్వాత తల్లీకూతుళ్లు ఆ రాత్రంతా ముచ్చట్లతోనే గడిపేశారు. తెల్లారి చూస్తే ఆ అమ్మాయి చనిపోయింది. కూతురు పాలిష్ చేసిన గోళ్లను ఎప్పటికి కట్ చేయొద్దనుకుందట.
కూతరు చనిపోయి 25 ఏళ్లు అవుతున్న ఎప్పుడు గోళ్లు కట్ చేసుకోలేదట. బయటికి వెళ్లినప్పుడు జనాలు వింతగా చూసినా, ఆమె మాత్రం అవేమీ పట్టించుకోలేదట. ఎందుకంటే ఆ గోళ్లను చూసుకున్నప్పుడల్లా తన కూతురు నాతోనే ఉన్నట్లు అనిపిస్తది అని ఆమె మిగతా పిల్లలతో చెప్పిందట.
ఇక, ఆ తర్వాత డయానాను..వాళ్లెప్పుడూ గోళ్లు కట్ చేసుకోమని చెప్పలేదు. ఆమె బయటికి వెళ్లినప్పుడు కొందరు ఫొటో దిగడానికి ఇష్టపడ్డా, ఒప్పుకోలేదు. ఇప్పుడు, గిన్నిస్ రికార్డుకు ఎక్కడంతో ఫొటోలకు ఓకే చెబుతానంటోంది. అంతేకాదు, పెరిగిన గోళ్లతోనే అన్ని పనులూ చక్కబెడుతుంది. ల్యాప్‌టాప్‌ను సైతం ఆపరేట్ చేస్తుంది. ఒక్క వంటమాత్రమే చేయలేనని చెబుతోంది. లక్ష డాలర్లు ఇస్తామని చెప్పినా తాను గోళ్లు మాత్రం కట్ చేయనంటోంది డయానా.