HYD : రెండేళ్లుగా కారులోనే అన్నీ.. పోలీసుల ఆశ్చర్యం - MicTv.in - Telugu News
mictv telugu

HYD : రెండేళ్లుగా కారులోనే అన్నీ.. పోలీసుల ఆశ్చర్యం

March 30, 2022

hfhbdfb

ఓ మహిళ రెండేళ్లుగా కారులోనే నివసిస్తున్న ఘటన ఎస్సార్ నగర్‌లో వెలుగు చూసింది. పోలీసులు విచారించగా.. పేరు తప్ప ఇంకేం తెలియదు అంటోంది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్ మెయిన్ రోడ్డులో ఓ పాడైన కారులో ఓ మహిళ నివాసం ఉంటోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళతో మాట్లాడారు. తన పేరు గుర్రం అనిత అని చెప్పి మిగతా వివరాలు తెలియదని చెప్పడంతో స్థానికుల వద్ద ఆరా తీశారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే హాస్టల్‌లో నివాసముండగా, డబ్బు చెల్లించకపోవడంతో హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. అప్పటి నుంచీ ఆమె కారులోనే నిద్రపోతూ, అందులోనే నివసిస్తోంది. రెండేళ్లుగా స్థానికులు ఆహారాన్ని అందిస్తూ వచ్చారు. కాగా, కారును రోడ్డుపై నిలిపి ఉంచినందుకు పోలీసులు గతంలో జరిమానా కూడా విధించారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఆమెను స్టేట్‌హోంకు తరలిస్తామని చెప్పగా, అందుకామె అంగీకరించలేదు. దీంతో మరోసారి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.