A women sucide attempt at cm jagan office
mictv telugu

జగన్ అపాయింట్‌మెంట్ దొరక్క చేయి కోసుకున్న మహిళ

November 2, 2022

ఏపీ సీఎం జగన్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆమె మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అచేతనంగా పడి ఉన్న మహిళను గమనించిన సీఎంవో పోలీసులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. చికిత్సకు రూ.2 కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో ఆ సాయాన్ని కోరేందుకు సీఎం జగన్‌ను కార్యాలయానికి వచ్చింది. అయితే జగన్ అపాయింట్ మెంట్ లభించకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళగా గుర్తించారు.తన కూతురు దివ్యాంగురాలి చికిత్స కోసం తమ భూమిని అమ్ముకోనియకుండా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ గన్‌ మెన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది.