9నెలల గర్భంతో 180 కి.మీ. నడిచింది..మార్గ మధ్యలో..  - MicTv.in - Telugu News
mictv telugu

9నెలల గర్భంతో 180 కి.మీ. నడిచింది..మార్గ మధ్యలో.. 

May 12, 2020

A women walk 180 kilometers to give birth

లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు ఎక్కడికన్నా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరంగా హాస్పిటల్ కి వెళ్లాల్సిన వెళ్లి అవస్థలు పడుతున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనం.

మాన్ కుమార్ అనే మహిళ.. తన భర్తతో కలిసి చండీగ‌ఢ్‌లో నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె 9నెలల గర్భవతి‌. ర‌వాణా స‌దుపాయం లేక‌పోవ‌డంతో ఆమె తన భర్తతో కలిసి కాలినడకన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు బయలుదేరింది. సుమారు 180 కిలోమీటర్ల దూరం నడిచి ఉత్తరాఖండ్ లోని రూర్కీ చేరుకుంది. అక్క‌డ రోడ్డుపైన‌నే స్థానికుల సహాయంతో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్రసవం జరిగిన ఓ గంట తర్వాత తన బిడ్డతో 270 కిలోమీటర్లు న‌డిచి అలీఘర్ చేరుకుంది. అక్క‌డున్న ‌వారిని సహాయం కోసం వేడుకుంది. దీంతో వారు ఆ త‌ల్లీబిడ్డ‌ల‌ను ఆదుకున్నారు. దీంతో ఆ జంట అక్కడినుంచి 1100 ప్రయాణించి మధ్య‌ప్ర‌దేశ్ చేరుకుంది.