A YCP worker threatened Anita on the phone
mictv telugu

అనితకు వైసీపీ కార్యకర్త బెదిరింపు ఫోన్.. మీడియా ముందే దొరికేశాడుగా

August 9, 2022

టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు మీడియా సాక్షిగా స్పీకర్ పెట్టి వినిపించారు అనిత. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి అనిత వచ్చారు. ఈ సమావేశం కొనసాగుతుండగా, వైసీపీ కార్యకర్త నుంచి అనితకు ఫోన్ వచ్చింది. తాను వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నానని అనిత చెప్తుండగా, మాధవ్ గురించి మాట్లాడాల్సిన అవరసరం లేదని ఆ వ్యక్తి హెచ్చరించాడు. మీడియా మైకుల ముందే ఈ సంభాషణ సాగడంతో అందరికీ వినిపించారు. తర్వాత ఆ ఫోన్ నెంబరుని మీడియాకు వెల్లడించారు. 9848075369 నెంబరు నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అనిత మీడియాకు షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఏపీలో తెగ సర్క్యులేట్ అవుతోంది.