A young girl complained against the rebbena SI
mictv telugu

జాబ్ ఇప్పిస్తానని ఎస్సై లైంగిక వేధింపులు.. ఎస్పీకి యువతి ఫిర్యాదు

July 12, 2022

A young girl complained against the rebbena SI

తెలంగాణలో ఖాకీచకుల సంఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే సీఐ నాగేశ్వర్రావు, ధరావత్ విజయ్‌ల రాసలీలలు బయటపడి డిపార్టుమెంటుకి అవమానకరంగా మారింది. తాజాగా ఈ వరుస క్రమంలో మరో ఎస్సై చేరాడు. కొమురం భీం జిల్లా రెబ్బెన మండల ఎస్సై భవానీ సేన్‌పై ఓ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకెళితే.. రాష్ట్రంలో ఇటీవల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతిని పుస్తకాలు ఇస్తా, ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన ఎస్సై భవానీ స్టేషనుకి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసిన యువతి.. వారి సహాయంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై భవానీ సేన్‌ను ఉన్నతాధికారులు ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ విచారణ చేస్తున్నారు. ఎస్సైపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, సీఐ నాగేశ్వరరావును హయత్ నగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.