A young man beat up a traffic police man in Haryana
mictv telugu

కారు ఆపాడని ట్రాఫిక్ పోలీస్‌‌ని చొక్కా చిరిగేలా కొట్టాడు.. వీడియో

October 19, 2022

A young man beat up a traffic police man in Haryana

వేగంగా వస్తున్న కారును ఆపాడని ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుపై రెచ్చిపోయాడు. కిందకు దిగి చితకబాది చొక్కా చించేశాడు. అక్టోబర్ 13న హర్యానాలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల దృష్టికి వచ్చింది.

రాజ్పుర్ – అంబాలా మార్గంలో అశోక్ కుమార్ అనే ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై రెండు బైకులను ఆపి తనిఖీ చేస్తున్నాడు. ఇంతలో ఓ ఎస్‌యూవీ వేగంగా రావడం గమనించి ఆపగా, కారు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేక ఆగి ఉన్న రెండు బైకులను ఢీకొట్టాడు. దీంతో బైకుపై కూర్చున్న ఇద్దరు గాయపడ్డారు. వెంటనే కారులోంచి కిందకు దిగిన యువకుడు.. ట్రాఫిక్ పోలీసును చొక్కా చిరిగేవరకు చితకబాదాడు. ఇంతలో జనాలు గుమిగూడడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. యువకుడిని భటిండాకు చెందిన లావిష్ బత్రాగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. గాయపడిన అశోక్ కుమార్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తెలిసింది.