రోజురోజుకీ భూమ్మీద వాహనాలు ఎక్కువైపోతున్నాయి. దాంతో పాటు ప్రమాదాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారు అలా అచేతనంగా ఉండిపోవడమో, చుట్టుపక్కల వారు వారిని లేపి ప్రథమ సపర్యలు చేయడమో చేస్తారు. కానీ వీడియోలో ఓ కుర్రాడు మాత్రం తనకు తగిలిన గాయాన్ని లెక్కచేయకుండా మార్షల్ ఆర్ట్ తరహా విన్యాసాలు చేశాడు. మన భాషలో చెప్పాలంటే ఒక రకంగా డ్యాన్స్ చేశాడు. బైకుపై వేగంగా వచ్చిన ఆ కుర్రాడు మరో డైరెక్షన్లో వస్తున్న కారును ఢీకొట్టాడు. బలంగా ఢీ కొనడంతో బైకు నుజ్జునుజ్జు అయింది. కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. అయితే కుర్రాడి తలకు హెల్మెట్ ఉండడంతో తలకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, ఒంటిపై కనపడని దెబ్బలు మాత్రం బాగానే తగిలి ఉంటాయి. అయితే దానిని కవర్ చేసుకోవడానికి ఆ యువకుడు అలా చేశాడా? లేదా ఏమైనా పిచ్చెక్కిందా? అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
Pendekar og pic.twitter.com/uyIpYPLK8T
— Mas Adem (@ndagels) June 23, 2022