గుండెపోటు..గతంలో 50-55 దాటిని వారికి మాత్రమే వచ్చేది. అది కూడా చాలా అరుదు. ఎక్కడో చెదురు ముదురు ఘటనలు కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో హార్ట్ ఎటాక్ సమస్య సర్వసాధారణమైపోయింది. చిన్న వయసులోనే చిట్టి గుండెలు ఆగిపోవడం కలవరపెడుతోంది. వయుస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులకు బలి అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు గుండెపోటులకు బాధితులగా మారిపోతున్నారు.
A Young Man Died on the Spot of a Heart Attack While Dancing at a Wedding Reception in Barat in kubeer mandal of Nirmal District,
Telangana. pic.twitter.com/bq5acaQdNz— Mohammed Zeeshan Ali Zahed (@zeeshan_zahed) February 26, 2023
తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికమంది హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చిన్న వయుస్సులోనే నందమూరి హీరో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. 23 రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి మరణించారు. తారకరత్నతో పాటు ఈ రెండు రోజుల్లో ముగ్గురు సడన్ డెత్‌కు గురయ్యారు. 4 రోజుల కిందట ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సికింద్రాబాద్‌లో కానిస్టేబుల్ విశాల్, కోనసీమలో వాలంటీర్ రాజాబాబులు సడన్‌గా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు వదిలారు.
తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కుబీరు మండలం పాడికె గ్రామంలో పెళ్ళి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ వేస్తూ ముత్యం పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముత్యం స్వస్థలం మహారాష్ట్రలోని శునికిగా తెలుస్తోంది.