జర్మనీలో వరంగల్‌ యువకుడు గల్లంతు..కేటీఆర్‌ను సాయం కోరిన కుటుంబం - MicTv.in - Telugu News
mictv telugu

జర్మనీలో వరంగల్‌ యువకుడు గల్లంతు..కేటీఆర్‌ను సాయం కోరిన కుటుంబం

May 10, 2022

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్‌ (26) మూడేళ్ల క్రితం జర్మనీలో ఉన్నత చదువులను అభ్యసించడానికి వెళ్లి, రెండు రోజల క్రితం ఓ నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అఖిల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ, తమ కొడుకు ఆచూకి, వివరాలను తెలిపేందుకు సాయం చేయాలంటూ కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. తన వంతు సాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.

మూడేళ్లుగా జర్మనీలోని హోట్టోవన్‌ యూనివర్సిటీలో అఖిల్‌ సోలార్‌ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్‌ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఓ నది వద్దకు వెళ్లాడు. నది ఒడ్డున సెల్పీ దిగే క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహంలో పడి, గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు, అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో భయాందోళనకు గురైన అఖిల్ తండ్రి కడారి పరుశురాములు, అఖిల్ సోదరి కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా సాయం చేయాలని, ఆచూకిని కనిపెట్టాలని కోరారు.