A young man moved a bull on a bike
mictv telugu

ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్‌పై ఎద్దును తీసుకెళ్తున్నాడు చూడండి

September 13, 2022

సోషల్ మీడియాలో ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో సాధారణ వ్యక్తుల వల్ల కాని కొన్ని పనులు నెటిజన్లకు నచ్చుతుంటాయి. కానీ, ఇలాంటి వీడియో మాత్రం కచ్చితంగా ఇప్పటివరకు చూసి ఉండం. ఎవరూ ఊహించడానికే సాహసం చేయని పనిని ఓ కుర్రాడు అవలీలగా చేసేశాడు. బైక్‌పై వెనుక సీటులో ఎద్దుని కూర్చోబెట్టి వెళ్తున్న యువకుడిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీడియో ప్రకారం.. ఓ యువకుడు బైక్ డ్రైవ్ చేస్తూ వేగంగా వెళ్తున్నాడు. వెనుక సీటుపై తాళ్లతో కట్టిన ఎద్దును ఉంచాడు. బైకు ఫుల్ స్పీడుతో వెళ్తున్నా ఆ ఎద్దు హాయిగా కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇదే వింత అనుకుంటే అంత స్పీడులో కూడా బైకుని అంత బ్యాలెన్స్‌గా నడిపిన ఆ కుర్రాడి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ అరుదైన ద‌ృష్యాన్ని రోడ్డుపై వెళ్తున్న వారు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటూ, మరొకరేమో సూపర్ యానిమల్ ట్యాక్సీ అని కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.