‘ఆర్ఆర్ఆర్’ : థియేటర్ వద్ద గన్‌తో యువకుడి ఫోజులు - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ : థియేటర్ వద్ద గన్‌తో యువకుడి ఫోజులు

March 25, 2022

gun

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పటివరకూ వినని ఎన్నో విశేషాలను మనం ఇప్పుడు వింటున్నాం. తెర ముందు మేకులు, రాజమౌళికి కటౌట్లు, రామరాజు వేషధారణతో బైక్ ర్యాలీ వంటి వార్తలు వచ్చినప్పుడు సినిమాకున్న క్రేజ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ, వాటన్నింటికీ భిన్నంగా ఓ యువకుడు చేసిన పనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణా థియేటర్ వద్ద ఓ యువకుడు తుపాకీతో సినిమా కొచ్చాడు. తుపాకి చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. సినిమా ప్రారంభమైన తర్వాత తెర వద్దకు చేరుకొని చేతిలో గన్‌తో డ్యాన్సలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. యువకుని తీరుతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. సినిమా అయిపోయిన తర్వాత బయటికొచ్చి గన్‌తోనే తిరుగుతుండడంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకొని విచారించగా, అది డమ్మీ అని తేలింది.