A young man survived two accidents by wearing a helmet
mictv telugu

వైరల్ యాక్సిడెంట్.. పోల్ విరిగి నెత్తిమీద పడ్డా ఏమీ కాలేదు

September 19, 2022

వాహనాలు పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్లు కూడా కామన్ అయిపోయాయి. వీటి వల్ల దేశంలో ఏటా ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ల నివారణ కోసం పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పౌరులు వాటిని పెడచెవిన పెడుతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. ముఖ్యంగా టూవీలర్ నడిపే వారు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అకస్మాత్తుగా సంభవించే ప్రమాదా నుంచి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు చెప్తుంటారు. హెల్మెట్ ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ఉన్న ఓ వీడియోను ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ వీడియో చూస్తే మీరు హెల్మెట్ పెట్టుకోవడం ఖాయమని చెప్తున్నారు. అందులో ఏముందంటే.. ఓ బైకర్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఉన్న ఓ కారు టర్న్ తీసుకోబోతూ బైకుని చూసి ఆగగా, కారు కదలికను చూసిన యువకుడు సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో బండి స్కిడ్ అయింది. బండితో సహా యువకుడు రోడ్డుపై పడి దొర్లాడు. బండి రోడ్డుపై ఉన్న స్తంభాన్ని బలంగా గుద్దుకుంది. హెల్మెట్ ధరించడం వల్ల యువకుడికి ఎలాంగి గాయాలు కాలేదు. సర్లే అని యువకుడు లేచి బండి వద్దకు వెళ్తుండగా, బండి గుద్దేసిన స్తంభం విరిగి యువకుడి తలపై పడింది. ఆ దెబ్బకు కచ్చితంగా చస్తాడని భావించినా, అలా జరుగలేదు. ఇలా వరుసగా జరిగిన రెండు ప్రమాదాల నుంచి హెల్మెట్ కాపాడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకున్న వారికి దేవుడు కూడా సాయం చేస్తాడని క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు హెల్మెట్ ఎంత అవసరమో గుర్తించి కామెంట్లు పెడుతున్నారు.