A young man tried to damage a Mona Lisa painting
mictv telugu

మోనాలిసా ముఖానికి అది పూశాడు.. ముసలావిడ వేషంలో వచ్చి…

May 30, 2022

A young man tried to damage a Mona Lisa painting

సుప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసాను ధ్వంసం చేయడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. కేక్‌ను పెయింటింగ్ మీద విసిరికొట్టి నాశనం చేయాలనుకున్నాడు. కానీ, పెయింటింగ్‌కు అద్దాలు రక్షణగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. వివరాలు.. చరిత్రకెక్కిన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ఫేమస్ చిత్ర పటం మోనాలిసా ప్యారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. సందర్శకులు దానిని చూస్తుండగానే వృద్ధుని వేషంలో వచ్చిన ఓ యువకుడు పెయింటింగ్‌పై దాడికి పాల్పడ్డాడు. వీల్ చైర్ నుంచి ఒక్కసారిగా లేచి పెయింటింగ్ వైపు దూసుకెళ్లాడు.

చేతిలో ఉన్న కేక్‌ను పెయింటింగ్ మీదికి విసిరికొట్టి, దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అలర్ట్ అయిన సెక్యూరిటీ గార్డులు యువకుడిని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తి పర్యావరణ వేత్తగా పనిచేస్తున్నట్టు తెలిసింది. నిందితుడిని పట్టుకున్న సమయంలో ‘ఈ ప్రపంచాన్ని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు’ అని ఫ్రెంచ్ భాషలో నినాదాలు చేయడం గమనార్హం. కాగా, మోనాలిసాపై దాడి ఇదే మొదటిసారి కాదు. 1956లో ఓ అగంతకుడు సల్ఫ్యూరిక్ ఆసిడ్‌తో చేసిన దాడిలో పెయింటింగ్ కింది భాగం బాగా ధ్వంసమయ్యింది. అప్పటి నుంచి జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులను రక్షణగా పెట్టారు.