చెరుకు ముక్కల్ని ఇలా తినాలంట.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

చెరుకు ముక్కల్ని ఇలా తినాలంట.. వీడియో వైరల్

March 28, 2022

 

cccc

ఎండాకాలం వచ్చిందంటే మనం చల్లని ద్రవ పదార్థాలతో పాటు తక్షణ శక్తినిచ్చే చెరకు రసాన్ని తరచూ తీసుకుంటుటాం. అయితే జ్యూస్‌లా కాకుండా చెరకు గడని నములుతూ మింగుతూంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అయితే చెరకును కొరికి తినడం వరకు ఓకే. కానీ, తిన్నాక మిగిలే పిప్పిని ఎక్కడ ఉమ్మాలో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉమ్మవచ్చు కానీ, అర్బన్ ప్రాంతాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో అయితే చెరకును తిని పిప్పిని ఉమ్మలేం. అలా చేస్తే పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. పిప్పి మీద ఈగలు వాలి చుట్టుపక్కల ఉండే వారికి ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చెవులకు ప్లాస్టిక్ కవర్ కట్టుకొని, చెరకు తిన్నాక మిగిలిన పిప్పిని ఆ కవర్లో ఊస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు, కవరును కూడా ఏదైనా డస్ట్‌బిన్‌లో పడేయవచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో కొత్త టెక్నిక్ అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్య ఎదురుపడినప్పుడు వీలుంటే ఈ టెక్నిక్‌ను పాటించండి.