వరంగల్ : కత్తితో యువతి గొంతు కోసిన ఉన్మాది ఆజార్ - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ : కత్తితో యువతి గొంతు కోసిన ఉన్మాది ఆజార్

April 22, 2022

13

ప్రేమ పేరుతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. తనను ప్రేమించట్లేదనే కోపంతో ఆమె బెడ్రూంలోకి దూరి గొంతుకోసి పరారయ్యాడు. వివరాలు.. లక్నేపల్లికి చెందిన అనూష అనే యువతి కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోంది. కొంతకాలంగా అజార్ అనే వ్యక్తి యువతిని ప్రేమపేరుతో వెంబడిస్తున్నాడు. యువతి నిరాకరించడంతో శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన స్పందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సీరియస్‌గా చర్యలు తీసుకోనందువల్లే మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, నిందితుడు ఆజార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.