A young man was arrested for making videos of lovers and threatening them
mictv telugu

చెట్లపొదల్లోని ప్రేమికుల రహస్య వీడియోలు.. బ్లాక్‌మెయిలర్ అరెస్ట్

July 21, 2022

ప్రేమికులు ఏకాంతంగా చెట్లపొదల్లో చేసే చిలిపి చేష్టలను రహస్యంగా వీడియో తీసి వాటితో బెదిరించి డబ్బులు దండుకునే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో రామకృష్ణ అనే యువకుడు ఉన్నాడు. అతను గ్రామ పరిసరాల్లోని దట్టమైన పొదల వద్ద రహస్యంగా మాటు వేసి అక్కడికి వచ్చే ప్రేమికుల కోసం వెయిట్ చేసేవాడు. వారు ఇతడిని గమనించకుండా ప్రేమకలాపాల్లో మునిగితేలుతుండగా, రామకృష్ణ రహస్యంగా వీడియో తీసేవాడు. ప్రేమికులు పొదల్లోంచి బయటికి రాగానే వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేవాడు. దీంతో ప్రేమికులు మారుమాట్లాడుకుండా అడిగినంత ఇచ్చి మరోసారి అక్కడకి రాకుండా జాగ్రత్త పడేవారు. ఇలా సుమారు 100 జంటల ఫోటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరిస్తుండడంతో విషయం బయటికి పొక్కింది. దాంతో మాటువేసి రామకృష్ణను పట్టుకున్న గ్రామస్థులు.. అతని ఫోన్‌లో ఉన్న ప్రేమికుల వీడియోలు చూసి గ్రామ సర్పంచ్ శైలజ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు రామకృష్ణను అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు చివ్వెంల ఎస్సై పి. విష్ణు తెలిపారు.