పెళ్లికాని ఎమ్మెల్యేకు మనవడినంటూ స్టిక్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికాని ఎమ్మెల్యేకు మనవడినంటూ స్టిక్కర్

March 18, 2022

bick

టైటిల్ చూసి కంగారు పడకండి. వార్త మొత్తం చదివితే ఏం జరిగిందనేది తెలుస్తుంది. వివరాల్లోకెళితే.. తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ నియోజకవర్గానికి బీజేపీకి చెందిన ఎంఆర్ గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఓ యువకుడు నేను ఎమ్మెల్యే మనవడినంటూ బైక్ నెంబర్ ప్లేటు మీద రాయించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు ఆపి వివరాలు అడగ్గా, ఆ యువకుడు అదే సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మా తాత అని ఆయువకుడు చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు అసలు పెళ్లే కాలేదు. పెళ్లి కాని తాతకు మనవడివి ఎలా అయ్యావు అని అడిగితే యువకుడు విచిత్ర సమాధానం చెప్పాడు. సంగతేంటంటే.. ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసే కన్నన్‌ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఆరకంగా తాను ఆయనకు మనవడినే కదా అని అమ్రిష్ అనే కన్నన్ కుమారుడు లాజిక్ పాయింట్ చెప్పాడు. ఇప్పుడా యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఎంఆర్ గాంధీ చాలా నిరాడంబరంగా జీవించే వ్యక్తి. ఇలాంటివి ఆయన అస్సలు సహించరు. కానీ ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఈ పని చేశానని యువకుడుచెప్పడంతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.