పెళ్లి పత్రికలో కేజీఎఫ్ డైలాగ్.. అవాక్కవుతున్న బంధువులు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి పత్రికలో కేజీఎఫ్ డైలాగ్.. అవాక్కవుతున్న బంధువులు

April 20, 2022

0020

కేజీఎఫ్ సినిమాలలో యాక్షన్, భావోద్వేగాలతో పాటు డైలాగులు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేజీఎఫ్ 2 సినిమాలో కూడా కొన్ని మాస్ డైలాగులు ఉన్నాయి. ఈ సినిమాలోని వైలెన్స్, వైలెన్స్ అనే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి అనేక మంది అనేక విధాలుగా పేరడీ చేసి వాడుకున్నారు. కానీ, కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు మాత్రం ఆ డైలాగుని వివాహానికి అన్వయించి పెళ్లిపత్రికపై రాయించాడు. ఇది చూసిన బంధువులు అవాక్కవుతుండగా, సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్, మై రిలేటివ్స్ లైక్స్ మ్యారేజ్. ఐ కాంట్ అవాయిడ్’ అంటూ అచ్చు వేయించాడు. దీంతో చాలా మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కాగా, కేజీఎఫ్‌లోని ఆ డైలాగుని హీరో యశ్ రాశాడని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పారు.