యువతులపై పాము దాడి, ఇంతలో.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

యువతులపై పాము దాడి, ఇంతలో.. వీడియో వైరల్

March 25, 2022

 

llll

పాము అంటే చాలా మంది భయపడతారు. ఫలానా చోట పాము ఉందని తెలిస్తే అటు వెళ్లడానికి మనం జంకుతాం. కానీ మనం వెళ్లే దారిలోనే పాము మన మీద సడెన్‌గా దాడి చేస్తే ఏం చేస్తాం? ఈ యువతులకు అలాంటి అనుభవమే ఎదురైంది. థాయిలాండ్‌లో కొందరు యువతులు సరదాగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. కొండల మీదుగా చెట్లు, పొదలు దాటుకుంటూ పైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ పాము పొదల్లోంచి అంతెత్తున లేచి ఓ యువతిని కాటేయబోయింది. అంతలో ఆ యువతి వేగంగా స్పందించి పాము కాటు నుంచి తప్పించుకుంది. ఇది చూసిన మిగతా యువతులు భయంతో కేకలు వేశారు. కాగా, వెనుక నుంచి నడుచుకుంటూ వస్తున్న యువతి తన ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి ఉండడంతో పాము దాడి ఘటన వీడియోలో రికార్డయింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే, మీకు పాములను తినడం అలవాటే కదా, పట్టుకొని కూర వండుకొని తినలేకపోయారా? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.