వీడియో : మెట్రోస్టేషన్ నుంచి దూకిన యువతి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : మెట్రోస్టేషన్ నుంచి దూకిన యువతి

April 14, 2022

girl

ట్రాఫిక్‌ సమస్య కారణంగా ప్రభుత్వాలు ఆధునిక సౌకర్యాలతో మెట్రో రైళ్లను ప్రవేశపెడుతుంటే వాటిని కొందరు యువత ఆత్మహత్యలు చేసుకోవడానికి వాటిని వాడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో ఓ యువతి ఇలాగే దూకి చనిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే నేడు ఢిల్లీలో జరిగింది. గుర్తు తెలియని యువతి గురువారం ఉదయం అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకేసింది. అంతకు ముందు అక్కడున్న రక్షణ సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా మొండికేసింది. ఆమెను మాటల్లో పెట్టి రక్షిద్ధామనుకున్న పోలీసులకు షాకిస్తూ సదరు యువతి కిందకు దూకేసింది. అయితే క్రింద కొందరు సిబ్బంది రక్షణ వలను ఏర్పాటు చేశారు. ఆమె కిందకు దూకగా, రక్షణ వల ద్వారా ఆమెను రక్షించడంతో స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలు దక్కాయి. అప్పటికే సిద్ధంగా ఉంచిన ఆంబులెన్స్‌లో యువతిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.