A young woman pretended to be pregnant for a seat
mictv telugu

సడెన్‌గా ఐదు నెలల గర్భం.. ఇదెక్కడి మోసం రా మావా.. వీడియో

August 31, 2022

A young woman pretended to be pregnant for a seat

ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి మనలో చాలా మంది మెట్రో రైలు ఎక్కుతారు. మన వద్ద ఈ మధ్యకాలంలోనే మొదలైన మెట్రో సేవలు.. విదేశాల్లో ఎప్పటినుంచో ప్రయాణికులకు అందుబాటులో వచ్చింది. రద్దీ పెరగడంతో వాటిలో కూడా సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది తప్పదన్నట్టు నిలబడే ప్రయాణం చేస్తుంటారు.

అయితే కొన్ని సార్లు మనలో చాలా మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు నిలబడి ప్రయాణిస్తుంటే లేచి కూర్చోవడానికి తమ సీటు ఇస్తారు. కొందరు సానుభూతితో, మరికొందరు మానవత్వంతో ఇలా చేస్తారు. ఈ టెక్నిక్‌ను పసిగట్టిన ఓ యువతి సీటు కోసం గర్భిణీగా నాటకమాడింది. వీడియో ప్రకారం.. మెట్రోలో నిలబడి ప్రయాణిస్తున్న ఓ యువతి.. సీటు కోసం భారీ స్కెచ్ వేసింది. ఓ యువకుడి వద్దకు వెళ్లి గాలి గట్టిగా పీల్చి పొట్టను ముందుకు నెట్టింది. దాంతో ఐదునెలల గర్భం ధరించిన స్త్రీలా కనిపించేసరికి జాలి వేసిన యువకుడు యువతికి కూర్చోవడానికి తన సీటును ఇస్తాడు. తీరిగ్గా సీట్లో కూర్చున్న యువతి తన పొట్టను ఫ్రీ చేసుకుంది. దీన్ని తోటి ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇదెక్కడి మోసం రా మావా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ టెక్నిక్ మన ఇండియాలో రాకూడదని, పాపం అబ్బాయిని బకరా చేసిందంటూ తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు.