ప్రేమ ఘర్షణ.. ముగ్గురు యువకులతో చాట్ చేసి ఆత్మహత్య  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమ ఘర్షణ.. ముగ్గురు యువకులతో చాట్ చేసి ఆత్మహత్య 

July 11, 2020

దగా చేసిన ప్రేమకు మరో యువతి బలైంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె ముగ్గురు యువకులతో చాటింగ్ చేసి ఉరి వేసుకుంది. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న సదరు యువతి కుటుంబసభ్యులు బయటకు వెళ్లినప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకోవడానికి ముందు ఆమె తన సెల్ఫీ వీడియోను.. నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన శివభార్గవ్,  అతడి స్నేహితులు వాసు, సాయి కిరణ్ అనే మరో ఇద్దరికి సెల్ఫీ వీడియో పంపింది. తాను ఉరి వేసుకుంటున్నానని వారికి చెప్పింది. అయితే వారెవరూ ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరైనా కనీసం తమకు చెప్పినా ఈ ఘోరం జరిగేది కాదని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఈ ఘటనపై మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో నేను, శివభార్గవ్ ఒకేచోట ఉన్నాం. కనీసం ఇలా సూసైడ్ చేసుకుంటుందనే విషయాన్ని కూడా వారు నాకు చెప్పలేదు. ఒక్క మాట చెప్పినా అక్క ప్రాణం కాపాడుకునే వాడిని. ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం అక్క ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం తెలిసింది’ అని తెలిపాడు.  శివ భార్గవ్‌ సుమారు 10 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని.. అతను ఎప్పుడూ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.