హాల్‌టిక్కెట్‌పై పోర్న్‌‌స్టార్ ఫోటో చూసి ఖంగుతిన్న యువతి - MicTv.in - Telugu News
mictv telugu

హాల్‌టిక్కెట్‌పై పోర్న్‌‌స్టార్ ఫోటో చూసి ఖంగుతిన్న యువతి

November 8, 2022

టీచర్ జాబు కోసం దరఖాస్తు చేసి పరీక్ష కోసం హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకున్న యువతి అందులోని ఫోటో చూసి ఖంగుతింది. తన ఫోటో కి బదులు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటో ఉండడంతో షాకయింది. వెంటనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి కర్ణాటక టీచర్స్ రిక్రూట్ మెంట్ పరీక్ష రాయాల్సి ఉంది. అందుకోసం అప్లై చేసుకొని హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేయగా, అందులో తన ఫోటోకి బదులు సన్నీలియోన్ ఫోటో ఉండడాన్ని గుర్తించింది.

వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికార బీజేపీపై విపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. తీవ్రంగా విమర్శిస్తూ.. అయినా అసెంబ్లీలో పోర్న్ చూసే పార్టీ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలమని ఎద్దేవా చేసింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేశ్ కార్యాలయం స్పందించింది. ‘దరఖాస్తు సమయంలో అభ్యర్ధే ఫోటో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏ ఫోటో పెడితే అదే వస్తుంది. సన్నీలియోన్ ఫోటో అప్ లోడ్ చేశారా అని అభ్యర్ధిని వాకబు చేశాం. తన భర్త స్నేహితుడు ఒకరు వివరాలు అప్ లోడ్ చేశాడని ఆమె చెప్పింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఫోటో ఎవరు అప్ లోడ్ చేశారో తేలాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామ’ని వివరణ ఇచ్చింది.