Aadhaar card for Ganesha in jarkhand
mictv telugu

వినాయకుడికి ఆధార్ కార్డు.. వైరల్ అవుతున్న వివరాలు

September 1, 2022

వినాయక చవితి వచ్చిందంటే యువత చాలా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. తమకు తోచిన, నచ్చిన విభిన్న రూపాల్లో గణేషుడిని తయారు చేయించి పూజలు చేస్తుంటారు. ఈ కోవలోకి వచ్చేవే మోదీ గణేష్, ఆరెస్సెస్ గణేష్, పుష్ప అల్లు అర్జున్ తగ్గేదేలే స్టైల్, కేజీఎఫ్ రాకీ భాయ్ వంటి గణేష్ విగ్రహాలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. అయితే వీటన్నింటికీ కాస్త భిన్నంగా జార్ఖండ్‌లోని ఉత్సవ కమిటీ సభ్యులు కొత్తగా ఆలోచించారు. వినాయకుడి మండపాన్ని ఆధార్ కార్డు తరహాలో డిజైన్ చేయించారు. కార్డుపై ఉన్న స్కానింగ్ కోడ్‌ను స్కాన్ చేస్తే గణపతికి సంబంధించిన వివరాలు వచ్చే విధంగా రూపొందించారు. అంతేకాక, కార్డులో తండ్రి పేరు మహదేవుడు, నివాసం కైలాసం అని కొత్త కాన్సెప్ట్‌కి తెరతీశారు. వీటితో పాటు ఆధార్ కార్డుకి ఓ నెంబరుని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ మండపం గురించి ఆ రాష్ట్రంలోని భక్తులు ఆరా తీస్తున్నారు.