ఆధార్ కార్డు కథ అంతేనా... - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ కార్డు కథ అంతేనా…

August 25, 2017

గోప్యతపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత  ఆధార్ కార్డు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది. ఇంతకు ఇప్పటి నుండి దేనికి ఆధార్ కార్డు వాడాలి. దేనికి వాడ కూడదనే విషయాలపై పెద్ద ఎత్తున డిబేట్ అవుతున్నది. ఆధార్ కార్డు చెల్లు బాటు అవుతుందా. ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారు. ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉంది అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆధార్ కార్డు వినియోగం విషయంలో మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.

సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ సీఈవో అజయ్ భూషణ్ పాండే వీడియాకు లేఖ విడుదల చేశారు.  ఆధార్ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆధార్  కార్డు అనేది పౌరుల యూనిక్ కోడ్  కాబట్టి దీన్ని దేనికి వాడాలనే విషయంలో ప్రభుత్వం  నిర్ణయం  తీసుకుంటుంది. అయితే దీన్ని ఎట్లా వాడాలి… దేనికి వాడాలి.. ఎందుకు వాడాలనే విషయంలో  మాత్రం ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

కొన్ని ప్రయివేటు సంస్థలు ఇష్టం వచ్చినట్లు  ఆధార్ కార్డులు తీసుకుంటున్నాయి.  వాటి వల్ల పౌరులకు సంబంధించిన సకల సమాచారం తెలుసుకుంటున్నాయి. దీంతో  పౌరుల వ్యక్తిగత హక్కుకు  భంగం కలుగుతుందని ఎప్పటి నుండో వాదనలు ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ వాదనలకు సమాధానం దొరికింది. మన దేశంలో ఇప్పటి వరకు 112 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. అంటే దేశ జనభాలో 88.2 శాతం మందికి జారీ అయ్యాయి. ఇంకో ఇరవై కోట్ల మందికి కార్డులు ఇవ్వాల్సి ఉంది. కార్డుల జారీ కోసం  ఇప్పటి వరకు 8800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.