చచ్చినా పీక్కుతింటున్న ఆధార్.. - MicTv.in - Telugu News
mictv telugu

చచ్చినా పీక్కుతింటున్న ఆధార్..

November 27, 2017

ఆధార్.. ఆధార్.. ఫోన్‌కు, రేషన్ కార్డుకు, గ్యాస్ బండకు, పాన్ కార్డుకు.. దేనికైనా సరే ఇది ఉండాల్సిందే. ఈ ఆధార్ పిచ్చి చివరికి శ్మశానానికీ పాకింది. బతికి ఉన్నప్పుడు కాల్చుకు తినే ఆధార్.. మనల్ని చచ్చిన కూడా విడిచిపెట్టదని ఈ ఉదంతం చెబుతోంది.

చచ్చిపోయిన వారికి ఆధార్ కార్డు లేకపోతే అంత్యక్రియలు నిర్వహించబోమని హరియాణాలోని ఫరీదాబాద్ కాటికాపర్లు తెగేసి చెబుతున్నారు. ఈ విషయాన్ని వల్లకాట్లో ఓ బోర్డుపై  తాటికాయంత అక్షరాలతో రాసి మరీ టాంటాం వేస్తున్నారు. దీంతో నగరవాసులు బిక్కమొగాలు వేశారు.

ఆధార్ కార్డు లేని మృతుల అంత్యక్రియలు ఎలా అని తలపట్టుకుంటున్నార. దీనిపై వివారదం రేగడంతో మునిసిపల్ అధికారులు ఆరా తీశారు. ఈ సంగతి తమకు తెలియదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రతిదానికి ఆధార్ అని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో శవదహనం, ఖననాలకు కూడా ఆధార్ అడుగుతారని శ్మశాన నిర్వాహకుతు ముందస్తు చర్యగా ఈ బోర్డు పెట్టినట్లు సమాచారం.