మీ ఆధార్‌కు ఇలా తాళం వేయండి - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఆధార్‌కు ఇలా తాళం వేయండి

October 9, 2019

సంక్షేమ పథకాల నుంచి ఐటీ రిటర్న్ వరకు ప్రతీ వ్యవహారం ఆధార్ కార్డుతోనే ముడిపడి ఉంది. ఏ పని జరగాలన్నా దాన్ని జోడిస్తే కానీ పూర్తి కాదు. కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ను ఉపయోగించడం వల్ల వ్యక్తిగత వివరాలను కొంత మంది కేటుగాళ్లు తీసుకుంటున్నారు. దీని వల్ల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆధార్ వివరాలు దొంగలించి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. అటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు లాక్, అన్ లాక్ విధానాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

దీని ద్వారా ఒకసారి ఆధార్ నెంబర్‌ను లాక్ చేస్తే తిరిగి అన్ ‌‌లాక్ చేసే వరకు ఇతర అవసరాలకు ఉపయోగించకుండా ఉంచవచ్చు. దీన్ని ఆన్‌లైన్ ద్వారా లేదా మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోవచ్చు.దీని కోసం ముందుగా వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. తర్వాత  www.uidai.gov.in లోకి వెళ్లి ఆధార్ ను లాక్/ అన్‌లాక్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా అయితే కింద ఇచ్చిన విధానంతో చేస్తే సరిపోతుంది. 

Aadhaar Lock.

లాక్ చేయడం ఇలా : 

  • ముందుగా రిజిస్టర్ మొబైల్ నుంచి GETOTP అని టైప్ చేసి ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలను జోడించి 1947 నెంబర్ కు SMS పంపించాలి.
  • LOCKUID అని టైప్ చేసి ఆధార్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు OTP ని మళ్లీ SMS చేయాలి.
  • SMS చేరిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది.
  • వెంటనే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్  SMS వస్తుంది.

ఆధార్ అన్ లాక్ చేయడం ఇలా:

  • అన్ లాక్ చేయాలంటే ముందుగా రిజిస్టర్ మొబైల్ నుంచి GETOTP అని టైప్ చేసి ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్‌తో పాటు 1947కి SMS చేయాలి.  
  • OTP వచ్చిన తర్వాత  UNLOCKUID అని టైప్ చేసిన ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ OTP కలిపి SMS పంపాలి.
  • వెంటనే UIDAI ఆధార్ నెంబర్‌ని అన్ లాక్ చేస్తుంది. 
  • అన్ లాక్ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ SMS వస్తుంది.