కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరి - MicTv.in - Telugu News
mictv telugu

కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరి

June 2, 2020

Aadhaar Must For Haircut in Tamilnadu

హెయిర్ కటింగ్ చేయించుకోవాలని అనుకునే వారికి తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు కఠిన తరం చేసింది. ఎవరైనా సెలూన్‌కు వెళ్తే తప్పసరి ఆధార్ వెంట తీసుకెళ్లాలని సూచించింది. షాపులో ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు రిజిస్టర్ చేసిన తర్వాతనే కటింగ్ చేయించుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 

సెలూన్‌కు వెళ్లే వారు ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకోవాలి. ఫోన్ నంబర్, చిరునామాకు సంబంధించిన ఆధార్ వివరాలు ఇవ్వాలి. ఇవి పూర్తి చేసిన తర్వాతనే హెయిర్ కట్ చేయాలని అధికారులు సూచించారు.  ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ఏసీలు, ఎయిర్ కూలర్లు వాడరాదని పేర్కొన్నారు. హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆదేశించారు. హెయిర్ కటింగ్ చేసే కార్మికులు చేతులకు హ్యాండ్ గ్లోజులు  వేసుకోవాలన్నారు. శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు.