Aadhaar Uidai New Restrictions On Name Change
mictv telugu

Aadhaar : ఆధార్‏లో మార్పులు రెండు సార్లే…

March 11, 2023

పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆధార్ ఇప్పుడు తప్పనిసరైంది. సిమ్ కార్డు కొనాలన్నా, అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఆఖరికి ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్నా ఆధార్ ఉంటేనే పని జరుగుతుంది. లేదంటే ఏ పనైకైనా మధ్యలోనే బ్రేక పడిపోతుంది. అయితే ఇంతటి కీలకమైన గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబర్లలో తప్పులుండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. దీంతో ఆధార్‏లో తప్పులుంటే మార్చుకునే వెసులుబాటును కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఇందులోనూ కొన్ని పరిమితులను విధించింది. కొన్ని ఆపష్లను పదే పదే మార్చుకునే వీలులేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆధార్‏లో ఏఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* ఆధార్ లో పేరును రెండు సార్లు మార్చుకోవచ్చు. పెళ్లైన తరువాత మహిళలు ఇంటి పేరును మార్చుకోవచ్చు. మీ సేవలో అయినా ఆన్‏లైన్ లో అయినా పేరును మార్చుకునే వెసులుబాటును కల్పించింది యూఐడీఏఐ.

* ఇక జెండర్ విషయంలో ఏమైనా తప్పు జరిగితే ఒసారి మార్చుకోవచ్చు.

* పుట్టిన తేదీ తప్పుగా నమోదు అయితే ఒకేసారి మార్చుకునే అవకాశం ఉంటుంది.

* రెసిడెన్సీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు, ఫోటో, వేలిముద్రలు, ఐరీస్ స్కాన్ లో మార్పులు చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు.