ఆధార్ - ఓటర్ కార్డు అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ – ఓటర్ కార్డు అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

January 25, 2020

Aadhaar Voter ID Linking.

ఇప్పటి వరకు పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల గుర్తుంపు కార్డుకు కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. దీనికి సంబంధించిన అనుమతులను కేంద్రం అంగీకరించింది. ఎన్నికల సంఘం విజ్ఞప్తికి కేంద్ర న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కొత్త చట్టానికి వీలుగా అన్ని అంశాలను చేర్చుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఆమోదం పొందిన వెంటనే ఆధార్ – ఓటర్ ఐడీ అనుసంధాన ప్రక్రియ మొదలుకానుంది. 

దీని ప్రకారం ఓటర్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్‌ నంబరును సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా నమోదు చేసుకునే వారు ఆధార్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. ఫేక్ ఐడీ కార్డులను గుర్తించడం, దొంగ ఓటర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఈసీ పేర్కొంది. బోగస్ కార్డులను ఏరివేసేందుకు సులువు అవుతుందని అభిప్రాయపడింది. మొత్తానికి ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి అంశానికి ముఖ్యం అయిపోందన్నమాట.