నవంబర్ లో ఆధార్ పై తాడో పేడో - Telugu News - Mic tv
mictv telugu

నవంబర్ లో ఆధార్ పై తాడో పేడో

October 30, 2017

ప్రభుత్వ పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటీషన్లను విచారించడానికి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామంది సుప్రీం కోర్టు.  చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.ఎమ్. ఖన్విల్ కర్, జస్టిస్ వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధార్ పై సుప్రీంలో దాఖలైన పలు పిటీషన్లపై కేంద్రం తన వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉందని, అప్పటివరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. ఆధార్ స్వచ్చంధమని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని పిటీషనర్ల తరుపు లాయర్ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. అటు మహారాష్ట్ర తరపున వాదించిన లాయర్ కూడా ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై స్పందించిన సుప్రీం, ఆధార్ పై తాము ఏర్పాటు చేసే రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ చివరి విచారణ జరపుతుందని స్పష్టం చేసింది.

     ప్రైవసీ అనేది భారత ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని ఇటీవలే తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ప్రైవసీకి ఆధార్ తో భంగం కలుగుతుందని కొంతమంది, వివిధ ప్రభుత్వ పథకాలను ఆధార్ తో లింక్ చేయడాన్ని ప్రశ్నిస్తు మరికొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు ధాఖలు చేశారు.