ఇన్ని రోజులు బిడ్డ పుట్టగానే వెంటనే ఆ బిడ్డ పేరుతో ఆధార్ కార్డు తియ్యాలనుకునేవాళ్ళంతా ఇప్పుడింకొక విషయాన్ని గ్రహించాలి. మరణించినవారి నమోదు కూడా అత్యవసరం అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియ అమలు కానున్నదట. డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగానే సదరు వ్యక్తి చనిపోయినట్టు ఆధార్ లో నమోదౌతుంది. డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చిన బంధువులు లేదా మిత్రుల వివరాలు కూడా ఆధార్ నెంబర్ తో సహా క్రోడీకరిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( PIB ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నంబర్ కూడా మరణించిన వారి యొక్క భార్యతో పాటు తల్లిదండ్రులది కూడా సేకరించబడుతుంది. ఒకవేళ దరఖాస్తుదారుడు తప్పుడు ప్రకటన చేస్తే నేరారోపణగా పరిగణిస్తారట.
అందుకే మరణించిన వారి గుర్తింపు కూడా అత్యవసరం అని భావించింది పిఐబి. కొన్ని సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్నుల రిటర్న్ లను దాఖలు చేయటానికి ఆధార్ తప్పనిసరి అని. అలాగే శాశ్వత ఖాతా నంబర్‌తో ఆధార్‌ను జతచేయడమే కాకుండా ఏ బ్యాంకు లావాదేవీలు 50,000 రూపాయలకు పైగా జరగకూడదనే విషయం తెలిసిందే.
చనిపోయినవారి డెత్ సర్టిఫికేట్లో ఆధార్ ను జత చేయటం వల్ల ముందు ముందు ఎవరూ ఆ వ్యక్తి ఆధార్ కార్డును వుపయోగించుకునే వీలుండదు. ఎందుకంటే ఆ నెంబర్ కొట్టగానే సదరు వ్యక్తి చనిపోయాడని చూపిస్తుంది. అలా కొందరు సిమ్ కార్డులకు ఫేక్ ఆధార్ లను వాడుకోవడం, ఇతరత్రా బ్లాక్ ధందాలకు ఆ వ్యక్తి ఆధార్ ను యధేచ్ఛగా వాడుకోవడం కుదరని పనన్నమాట. ఇంత వరకు ఆధార్ నమోదులో బతికున్నవారి వివరాలే వుంటున్నాయి తప్పితే చనిపోయినవారి వివరాలు వుండటం లేదు. ఇలా చనిపోయినవారి డెత్ సర్టిఫికేట్ కోసం ఆధార్ ను జత చెయ్యటం వల్ల ఫ్యూఛర్ లో జరిగే ఫ్రాడ్స్ ని అరికట్టవచ్చని ఈ ప్రక్రియకి పూనుకుంది పిఐబి.