ఆధార్ గుడ్‌న్యూస్.. ఏ రూపంలో ఉన్నా చెల్లుతుంది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ గుడ్‌న్యూస్.. ఏ రూపంలో ఉన్నా చెల్లుతుంది.. 

October 23, 2020

Aadhar PVC Card now comes in smart size, here's how to get PVC Aadhaar card.

ఆధార్ కార్డు పెద్దసైజులో ఉండటంతో ఇబ్బందులు ఉన్నాయని.. ఇకపై డెబిట్ కార్డు రూపంలో చిన్న సైజులో వస్తోందని తెలిసిందే. అయితే పీవీసీ కార్డు రూపంలో వచ్చే ఆధార్ మాత్రమే చెల్లుతుందని, లెటర్, ఈఆధార్, పీవీసీ కార్డులు చెల్లవని ప్రచారం అవుతోంది. దీంతో కొంతమంది పాత ఆధార్ కార్డుకు నూకలు చెల్లినట్టేనా అని హైరానా చెందుతున్నారు. మళ్లీ మీ సేవకు వెళ్లడం లేదా, ఆన్‌లైన్‌లో అప్లై చేయడం వంటి ప్రాసెస్, పైగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని అనుకున్నారు. అయితే అలాంటి తలనొప్పులు ఏం ఉండవని ఆధార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 

ఆధార్ కార్డుతో పాటు లెటర్, ఈ ఆధార్, పీవీసీ కార్డులను కూడా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చని, వీటిని సబ్మిట్ చేసి ప్రభుత్వ సబ్సిడీలు, గ్రాంట్స్ పొందవచ్చని వెల్లడించింది. కాగా, ఇటీవల ఆధార్ పీవీసీ కార్డ్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పీవీసీ కార్డులో అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. డెమొగ్రఫిక్ వివరాలను పొందుపరిచారు. హోలోగ్రామ్, ఘోస్ట్ ఇమేజ్, మైక్రో టెక్ట్స్, ఇష్యూ, ప్రింట్ తేదీ వంటివన్నీ ఉంటాయి. పీవీసీ కార్డుపై ఆధార్ లోగో కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులాగా పీవీసీ కార్డును పర్సులో క్యారీ చేయొచ్చు.