ఆక్సఫర్డ్  డిక్షనరీలోకి ఆధార్, డబ్బా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆక్సఫర్డ్  డిక్షనరీలోకి ఆధార్, డబ్బా.. 

January 25, 2020

Oxford.

భారతీయ పౌరుడికి ఇప్పుడు ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది.  నా ఆధార్ నా గుర్తింపు నినాదంతో ప్రతి ఒక్కరికి ఇది గుర్తింపు కార్డు. ప్రస్తుతం ఈ పదానికి అరుదైన గుర్తింపు వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ తన లేటెస్ట్‌ ఎడిషన్‌ డిక్షనరీలో దీనికి చోటు కల్పించింది. ఈసారి మొత్తం 26 భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది. అతి తక్కువ కాలంలోనే ఆధార్ పదం ఆక్స్‌ఫర్డ్‌  డిక్షనరీలోకి చేరడం విశేషం.  

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 10వ ఎడిషన్‌ తాజాగా విడుదల చేసింది. దీంట్లో భారతీయ ఆంగ్ల పదాలతో పాటు చాట్‌బోట్, ఫేక్‌ న్యూస్, మైక్రోప్లాస్టిక్‌ వంటి కొత్త పదాలను చేర్చినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పేర్కొంది.ఈసారి డిక్షనరీని  ఆడియో–వీడియో ట్యుటోరియల్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లలోనూ తీసుకువచ్చారు. ఈ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించగా.. మిగతా నాలుగు పదాలు డిజిటల్‌ వర్షన్‌లో ఉన్నాయి.