అమెరికా చేతిలో ఆధార్ గుట్టు! - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా చేతిలో ఆధార్ గుట్టు!

August 26, 2017

ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా మన ఆధార్ కార్డులపైనా పంజా విసిరింది. అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ వద్ద ఆధార్ కార్డుల సమాచారం ఉందని వికీలీక్స్ తాజాగా విడుదల చేసిన పత్రాల్లో ఈ వివరాలు ఉన్నాయి.

అమెరికా కేంద్రంగా పనిచేసే క్రాస్ మ్యాచ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఎలక్ర్టానిక్ సాధనాలతో సీఐఏ ఆధార్ సమాచారాన్ని కొట్టిగట్టినట్లు భావిస్తున్నామని వికీలీక్స్ తెలపింది. ఈ సంస్థ ఆధార్ అధికార సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం యథావిధిగా తోసిపుచ్చింది.

ఆధార్ సమాచారానికి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న తమ ఆధార్ కార్డుల్లోని సమాచారం లీకైందని, పలు ప్రైవేట్ కంపెనీలు ఆ సమాచారం ఆధారంగా తమను రకరకాల మెసేజీలతో వేధిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.