Aadhi Pinisetty and Nikki Galrani start wedding celebrations with haldi function
mictv telugu

ఆది పినిశెట్టి-నిక్కి గల్రాని పెళ్లిసందడి ఫొటోలు

May 18, 2022

Aadhi Pinisetty and Nikki Galrani start wedding celebrations with haldi function

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమజంట ఒక్కటి కాబోతుంది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆది పినిశెట్టి ఈ రోజు పెళ్లి పీటలెక్కుతున్నారు. కొన్ని రోజులుగా హీరోయిన్ నిక్కీ గల్రానితో ప్రేమలో ఉన్న ఆది .. ఈ రోజు మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్నారు. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్‌, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు.

Aadhi Pinisetty and Nikki Galrani start wedding celebrations with haldi function

2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక, ‘ఒక విచిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాలతో ఆది తెలుగువారికి సుపరిచితులయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిజీగా ఉన్నాడు ఆది. మొన్నీ మధ్యే క్లాప్ సినిమాతో వచ్చాడు ఈయన. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.

Aadhi Pinisetty and Nikki Galrani start wedding celebrations with haldi function

Aadhi Pinisetty and Nikki Galrani start wedding celebrations with haldi function