‘కృష్ణాష్టమి’ హీరోయిన్‌ గల్రానికి కరోనా   - MicTv.in - Telugu News
mictv telugu

‘కృష్ణాష్టమి’ హీరోయిన్‌ గల్రానికి కరోనా  

August 14, 2020

Aadi Pinisetty Girl Friend Nikki tests positive for Coronavirus..

ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా సోకింది. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ‘నాకు గొంతునొప్పి, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించాయి. వైద్యుల సూచనలతో కోలుకుంటున్నాను. ఇంట్లోనే క్షేమంగా, సురక్షితంగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నవారికి, వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని నిక్కీ పోస్టులో వెల్లడించింది. తాను యవ్వనంలో ఉన్నాను కాబట్టి, ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని పేర్కొంది. కరోనా నుంచి త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నానని స్పష్టంచేసింది. 

నా తల్లిదండ్రులు, స్నేహితులకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వాపోయింది. ‘ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించడాన్ని అస్సలు మరచిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది, అయినప్పటికి సమాజం కోసం మనవంతు సాయం చేయాల్సిన సమయం ఇది. కుటుంబంతో సరదాగా గడపండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అంటూ నిక్కీ తన పోస్టులో రాసుకొచ్చింది. కాగా, నిక్కీ గల్రాని తెలుగులో సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించింది. ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజనకు నిక్కీ సోదరి అవుతుంది. ఇటీవల ఆమెకు, ఆది పినిశెట్టికి పెళ్లి అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.