చిన్న బోయిన చిపురుకట్ట... - MicTv.in - Telugu News
mictv telugu

చిన్న బోయిన చిపురుకట్ట…

June 15, 2017


అవునన్నా….కాదన్నా…చీపురు చీపురే. ఢిల్లీ చీపురు కట్ట పార్టీ ఆప్ మల్లో సారి తన వెరైటీ స్టైల్ ను సూపెట్టుకున్నది. ముఖ్యమంత్రి పార్టీ ఆఫీసుకే నోటీసు పంపిండ్రు ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు. ముఖ్యమంత్రి ఉండగనే ఎట్ల పంపుతరని పరేషాన్ గావొద్దు…..ఆప్ పార్టీ ఆఫీసు సర్కారు బంగ్లల నడుపుతున్నరు… పెట్టికాన్నుంచి బొట్టు పైస కిరాయి ఇయ్యకుంటు ఖుషీ అయితే ఊకునేది లేదు… అద్దె గడ్తరా లేక పోతే ఖాళీజేసి పోతరా అని తాఖీదులు పంప్రిండట. అరే…. గిదేం తీర్వాన ముచ్చటని అనుకోకుండ్రి…. ఇంతకు ముందుల్నే ఓ పారి ఏకంగా కేజ్రీవాల్ సార్ కే నోటీసులు పంపిండ్రట. పార్టీ పెద్దవు నీవే కావట్టి 27 లక్షల బిల్లు కట్టమని ఆఫీసర్లు అడిగిండ్రంట. పాపం సారుకు జెల్ది ముచ్చట అర్థంగానట్లుంది…. జెర్రకంత సెవులకు ఎక్కిచ్చుకున్నా ఇషయం ఈడ్దాంక వొచ్చేది గాదు గావొచ్చు….. పొలిటికల్ చెత్త ఊడ్సస్తమని వొచ్చిన చీపురు గుర్తు పార్టీ ఆఫీసును అద్దె కట్టకుంటే గిట్ల మేం ఊకిపాడేస్తమని ఆఫీసర్లు అంటున్నరు. ముఖ్యమంత్రి కింద పన్జేసే ఆఫీసర్లే గిట్ల జేస్తున్నరంటే…. లోపటి మర్మం ఆ పెద్ద చీపురు కట్టకే తెల్వాలే.